Case in English Grammar | English grammar | types of cases

Contents

Case in English Grammar Learn from Telugu

Case : విభక్తి లేక కారకము :

Case in English Grammar | English grammar | types of cases : Subjective Case / Nominative Case / Objective Case / Possessive Case - paviacademy
Case in english grammar through telugu – English grammar – types of cases – paviacademy

1 . What is a case ?

♦  Case : విభక్తి :

The relation in which a noun or a pronoun stands to some other word in the sentence, or the form which shows such relation is called the case.

ఒక వాక్యములో నామవాకాకమునకు లేదా సర్వనామమునకు ఇతర పదముతో గల సంబధమును గాని , ఆ సంబధమును సూచించు పద రూపమును గాని విభక్తి (case) అంటారు.

Kinds of cases : (విభక్తులలో రకములు)

2 . How many kinds of cases are there in English? What are they ?

♦  Kinds of cases : (విభక్తులలో రకములు)
There are five cases in English
ఇంగ్లీషు లో 5 విభక్తులు (cases) ఉన్నవి.
అవి :
1.Nominative case    (ప్రధమా విభక్తి )
2.Objective or Accusative case   (ద్వితీయా విభక్తి )
3. Possessive or Genitive case   (షష్టీ విభక్తి )
4. Vocative case [ or nominative of address ]   (సంబోధనా ప్రధమా విభక్తి )
5. Dative case   (ద్వితీయా విభక్తి )

3 . What is the Nominative Case?

♦   Nominative case : (ప్రధమా విభక్తి )

1 . When a noun or a pronoun is used as a subject of a verb , it is said to be in the Nominative case .

ఒక నామవాచకము లేదా సర్వనామము ఒక క్రియకు కర్తగా ఉపయోగింపబడినప్పుడు, అది Nominative Case లో ఉన్నదని చెప్పబడును.

The horse kicked the boy .

ఈ వాక్యములో horse అనే నామవాచకము kicked అనే క్రియకు subject (కర్త ) గా వాడబడింది. అందువల్ల అది Nominative Case లో ఉన్నదని చెప్పబడును.

2.When the noun or pronoun is used as the complement of the verb to be or to seem etc., it is also said to be in the nominative case .

be’,’seem’ అనే క్రియలకు complement గా ఉన్న నామవాచకము లేదా సర్వనామము కూడ Nominative Case లో ఉన్నదని చెప్పబడును.

Examples : (ఉదాహరణలు )

He is a doctor .
She is a teacher.

3.The nominative answers the question who? Or what ?

ఎవరు?ఏది? అని ప్రశ్నించినపుడు వచ్చిన సమాధానము Nominative Case లో ఉండును.

4 . What is the Accusative case?

♦   Objective case [Accusative case ]: (ద్వితీయా విభక్తి )

1. When a noun or pronoun is used as an object of a verb , it is said to be in the objective or accusative case .

ఒక నామవాచకము లేదా సర్వనామము ఒక క్రియకు కర్మ (object ) గా వాడబడినప్పుడు, అది Objective Case or Accusative Case లో ఉన్నదని చెప్పబడును.

Examples :(ఉదాహరణలు )

The horse kicked the boy .

ఈ వాక్యములో ‘boy’ అనే నామవాచకము ‘kicked’ అనే క్రియకు కర్మ (object ) గా వాడబడినది.అందువల్ల అది Objective Case   లో ఉన్నదని చెప్పబడును.

2. A noun which comes after a preposition is also said to be in the accusative case .

Preposition తరువాత వచ్చే నామవాచకము లేదా సర్వనామము కూడ Accusative Case లో ఉన్నదని చెప్పబడును.

Examples 🙁ఉదాహరణలు )

The book is on the table.

ఈ వాక్యములో ‘table’ అనే నామవాచకము ‘on’ అనే Preposition తరువాత వచ్చినది.అందువల్ల అది Objective Case లో ఉన్నదని చెప్పబడును.

3.The objective answers the question whom ?or what ?

ఎవరిని? దేనిని? అని ప్రశ్నించినప్పుడు వచ్చిన సమాధానము Objective Case లో ఉండును.

5 . What is the Genitive case?

♦  Possessive or Genitive case (షష్టీ విభక్తి ) :

1.The form of the noun which shows ownership or possession is said to be in the possessive or genitive case.

స్వామ్యము లేకా యాజమాన్యమును (Ownership ), స్వాధీనత (possession) ను తెలియజేయు నామవాచక రూపము Possessive case లేక genitive case లో ఉందని చెప్పబడును.

Examples 🙁ఉదాహరణలు )

This is Rama’ s pen .

ఈ వాక్యములో Rama’ s అనే నామవాచక రూపము ‘రాముని యొక్క’ అనే అర్థము ఇస్తుంది.అందువల్ల అది Possessive case లో ఉందని చెప్పబడును.

2. The possessive case does not always denote possession. It is also used to denote authorship , origin , kind, etc .

Possessive case ఎప్పుడు స్వాదీనతను మాత్రమే సూచించదు.అది గ్రంథకర్త్రుత్వమును (authorship ), పుట్టుకను (origin ), రకము (kind ) ను కూడ   తెల్పుతుంది .

1.Shakespeare ‘s plays = the plays written by Shakespeare.
2.A mother ‘s love = the love felt by a mother .
3.Sir Surendranath’ s speech = the speech delivered by Sir Surendranath .
4. The court’s decree = the decree passed by the court.
5.Wellington’s victories = victories gained by Wellington.
6.Rama’s temple = the temple dedicated to Rama.
7. Solomon’s temple = the temple built by Solomon.

3. The possessive answers the question whose?

Whose? ఎవరిది? అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానము possessive case లో ఉంటుంది.

Examples 🙁ఉదాహరణలు )

Whose pen ? Rama’s.

6 . What is the Vocative case ?

♦   Vocative case [ or Nominative of Address ](సంబోధనా ప్రధమా విభక్తి ) :

A noun used to name a person or thing addressed is in the vocative case.

ఒక వ్యక్తి లేదా వస్తువును సంబోదిన్చుటకు వాడబడిన నామవాచావకము Vocative case లో ఉన్నాడని చెప్పబడును.

Examples 🙁ఉదాహరణలు )

Come on, boys.
Come into the garden, Ravi
Drink, pretty creature, drink.

O Death, Where is thy sting?
Friends, Romans, Countrymen, lend me your ears.

పై వాక్యములో italics లో ఉన్న boys , Ravi, Pretty , creature , o death , friends , Romans , country men అనే పదములు సంబోధనను తెల్పుటకు ఉపయోగింపబదినవి.కాబట్టి అవి vocative case లో ఉన్నవని చెప్పబడును.

7 . What is the Dative case?

♦   Dative case(ద్వితీయా విభక్తి ) :

A noun used as the indirect object of a verb is said to be in the Dative case.

క్రియ యొక్క పరోక్ష కర్మ (indirect object) గా వాడబడిన నామవాచకము Dative case లో ఉన్నదని చెప్పబడును.

Examples 🙁ఉదాహరణలు )

Rama gave Hari a ball.

ఈ వాక్యములో ‘gave’ అనే క్రియకు ball అనే నామవాచకము ‘Direct object’. ‘Hari’ అనే నామవాచకము ‘Indirect object’ అందువల్ల ‘ball’ అనే నామవాచకము ‘objictive case’ లోను ‘ Hari’ అనే నామవాచకము ‘Dative case’ లోను ఉండును.

In short ;
1. The Nominative is the case of the subject .
2.The Accusative is the case of the object .
3. The Possessive the case of the noun showing possession.
4. The Vocative is the case of the noun addressed.
5. The Dative is the case of the indirect object.

8 . What is the Noun in Apposition?

♦   Noun in Apposition:

1. when one noun follows another noun to describe it the noun which follows is said to be in apposition to the noun which comes before it.
(‘Apposition’ means ‘placing near’ )

ఒక నామవాచకమును వర్ణించుటకు మరొక నామవాచకము దాని తరువాత వచ్చినపుడు రెండవ నామవాచకము ,మొదటి నామవాచకమునకు ‘Apposition’ లో ఉన్నదని చెప్పబడును.

Examples 🙁ఉదాహరణలు )

Rama , our captain , made fifty runs.

ఈ వాక్యములో ‘Rama’ అనే నామవాచకమును వర్ణించుటకు ‘captain’ అనే మరొక నామవాచకము దాని తరువాత వచ్చినది.అందువల్ల ‘captain’ అనే నామవాచకము ‘Rama’ అనే నామవాచకమునకు ‘Apposition’ లో ఉన్నదని చెప్పబడును.

2 . A noun in apposition is in the same case as the noun which it explains.

Apposition లో ఉన్న నామవాచకము అది వర్ణించే నామవాచకము యొక్క cases లోనే ఉండును.

Examples 🙁ఉదాహరణలు )

1. Kabir, the great reformer, was a weaver. ( Nominative Case) .
2. Yesterday I met my uncle , the doctor. (Objective Case )
3. Have you seen Ganguli , the artists drawings ? (Possessive Case ).

Related English Lessons:
The English Alphabet
Parts of Speech
Kinds of Nouns
Kinds of Gender
Singular and Plural Rules

Post Author: Pavi Academy

Avatar photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *