90 రోజులలో స్పోకెన్ హిందీ తెలుగులో – 6 వ రోజు . పూర్తి కోర్సు ఉచితం తెలుగులో How to learn spoken Hindi fluently from Telugu ǁ 90 Days Spoken Hindi in Telugu – www.paviacademy.com ద్వారా సులువుగా నేర్చుకొండి.
Day 06 : 90 Days Spoken Hindi Course in Telugu
Rule : Sub + Q.W + नहीं + जाना चाहता हूँ
వివరణ :
ప్రధాన క్రియకు ముందు Question Word మరియు नहीं అనే పదాలు చేర్చినట్లయితే Question Word తో Negative Sentence ఏర్పడుతుంది.
Note :
Question Words అంటే …ఎప్పుడు , ఏమిటి , ఎక్కడ , ఎలా , ఎందుకు ….. ఇటువంటి పదాలు Question Words అని పిలుస్తాం .
ప్రధాన క్రియ గనుక రెండు పదాలుగా వచ్చినట్లయితే రెండవ పదానికి ముందు नहीं అనే పదం రావాలి . ఏ విధంగా అంటే .. मदद करना అనే ప్రధాన క్రియ రెండు పదాలుగా కలిగి ఉంది . కాబట్టి అలాంటి సందర్భంలో రెండవ పదానికి ముందు नहीं అనే పదం రావాలి . అంటే मदद नहीं करना ఈ విధంగా వస్తుంది.
నేను ఎందుకు సహాయం చేయాలనుకోవడం లేదు ( Male )
मैं क्यों मदद नहीं करना चाहता हूँ
నేను ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదు ( Female )
मैं क्यों नहीं जाना चाहती हूँ
అతను ఎందుకు ప్రమాణం చేయాలనుకోవడం లేదు ( Male )
वह क्यों वादा नहीं करना चाहता है
ఆమె ఎందుకు బెదిరించాలనుకోవడం లేదు ( Female )
वह क्यों नहीं धमकाना चाहती है
రవి ఎందుకు బాగుచెయ్యాలనుకోవడం లేదు ( Male )
रवि क्यों ठीक नहीं करना चाहता है
పవిత్ర ఎందుకు ఉపయోగించాలనుకోవడం లేదు ( Female )
पवित्र क्यों प्रयोग नहीं करना चाहती है
ఇతడు ఎందుకు వృధా చెయ్యాలనుకోవడం లేదు ( Male )
यह क्यों बरबाद नहीं करना चाहता है
ఈమె ఎందుకు బహుమానం పొందాలనుకోవడం లేదు ( Female )
यह क्यों इनाम नहीं पाना चाहती है
నువ్వు ఎందుకు అడగాలనుకోవడం లేదు ( Male )
तुम क्यों नहीं पूछना चाहते हो
నువ్వు ఎందుకు త్రాగాలనుకోవడం లేదు ( Female )
तुम क्यों नहीं पीना चाहती हो
మీరు ఎందుకు వినాలనుకోవడం లేదు ( Male )
आप क्यों नहीं सुनना चाहते हैं
మీరు ఎందుకు కాపాడాలనుకోవడం లేదు ( Female )
आप क्यों नहीं बचाना चाहती हैं
మేము ఎందుకు అనుమతి ఇవ్వాలనుకోవడం లేదు ( Male )
हम क्यों अनुमति नहीं देना चाहते हैं
మేము ఎందుకు ఆజ్ఞాపించాలనుకోవడం లేదు ( Female )
हम क्यों आज्ञा नहीं देना चाहती हैं
వాళ్ళు ఎందుకు హెచ్చరించాలనుకోవడం లేదు ( Male )
वे क्यों चेतावनी नहीं देना चाहते हैं
వాళ్ళు ఎందుకు పంపించాలనుకోవడం లేదు ( Female )
वे क्यों नहीं भेजना चाहती हैं
వీళ్ళు ఎందుకు చెప్పాలనుకోవడం లేదు ( Male )
ये क्यों नहीं कहना चाहते हैं
వీళ్ళు ఎందుకు పరిపాలించాలనుకోవడం లేదు ( Female )
ये क्यों शासन नहीं करना चाहती हैं / ये क्यों पालन नहीं करना चाहती हैं
రవి , పవిత్ర ఎందుకు పంచాలనుకోవడం లేదు / విభజించాలనుకోవడం లేదు
रवि और पवित्र क्यों नहीं बांटना चाहते हैं
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.
రవి, శ్రీను ఎందుకు కోల్పోవాలనుకోవడం లేదు
रवि और श्रीनु क्यों खो नहीं देना चाहते हैं
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అబ్బాయి + అబ్బాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ते हैं ] రావాలి.
పవిత్ర , సరళ ఎందుకు త్యాగం చెయ్యాలనుకోవడం లేదు
पवित्र और साला क्यों कुरबानी नहीं देना चाहती हैं
Here ,
Plural names ( బహువచన పేర్లు ) అమ్మాయి + అమ్మాయి కలిపి బహువచన పేర్లు వచ్చినప్పుడు [ ती हैं ] రావాలి.
For more Details :
My Website : https://www.paviacademy.com/
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/paviacademy
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn Hindi to Telugu Translation І 90 Days Spoken Hindi in Telugu .
Thank you for reading . I Hope you liked it. Please Give feedback, comments and share this article.
Related 90 Days Spoken Hindi in Telugu Full Course :
Day 01 : 90 Days Spoken Hindi in Telugu
Day 02 : 90 Days Spoken Hindi in Telugu
Day 03 : 90 Days Spoken Hindi in Telugu
Day 04 : 90 Days Spoken Hindi in Telugu
Day 05 : 90 Days Spoken Hindi in Telugu
