Hindi Alphabet Learn from  Telugu language

Learn  Hindi Alphabet from Telugu language | हिन्दी वर्णमाला | హిందీ అక్షరమాల 

In this article we are going to know about Hindi Alphabet by Telugu For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .

తెలుగు వివరణతో స్పోకెన్ హిందీ మరియు వ్యాకరణము అన్ని పరీక్షలకు , అన్ని పోటీ పరీక్షలకు Hindi Alphabet సులువుగా paviacademy.com ద్వారా నేర్చుకొండి .

 Lesson : 01

हिन्दी वर्णमाला ( Hindi Alphabet ) : The set of letters used in writing a language is called the Alphabet.
ఒక భాషను వ్రాయటానికి ఉపయోగించే అక్షరాలను అక్షరమాల లేక వర్ణమాల Alphabet అంటారు .
There are 50 letters in Hindi Alphabet.
హిందీ అక్షరమాలలో 50 అక్షరాలున్నాయి .
हिंदी अक्षरों में 50 अक्षर हैं |

Contents

स्वर ( స్వర్ ) – అచ్చులు  ( vowels)

Hindi Alphabet | Learn Hindi Alphabet | Hindi varnamala | Hindi varnamala from Telugu | Hindi varnamala through Telugu | www.Pavi Academy.com
स्वर ( స్వర్ ) – అచ్చులు ( vowels)

 

These 11 letters are called vowels.

ఈ 11 అక్షరాలను స్వరములు లేక అచ్చులు అంటారు .

इन ग्यारह (11) अक्षरों ने स्वर कहते हैं |

Note : గమనిక :

  • In Telugu, ఋ and ౠ are different vowels. Hindi has the same voice.
  • Similarly, e voice in Hindi should be pronounced as e / ê .
  • Similarly, o voice in Hindi should be pronounced as o / Ô.

1 : తెలుగులో , లు వేరు –వేరు స్వరములు . హిందీలో    ఒకే స్వరము కలదు . కనుక     సందర్భానుసారంగా   , గాను ఉచ్చరించాలి.

2 : అట్లే  హిందీలోని    స్వరం  సందర్భానుసారంగా / గాను  ఉచ్చరించాలి.

3 : అదేవిధంగా  హిందీలోని  ओ   స్వరం  సందర్భానుసారంగా /  గాను  ఉచ్చరించాలి

व्यंजन ( వ్యంజన్ ) – హల్లులు  ( consonants)

Hindi Alphabet:The set of letters used in writing a language is called the Hindi Alphabet.ఒక భాషను వ్రాయటానికి ఉపయోగించే అక్షరాలను అక్షరమాల Alphabet అంటారు .
व्यंजन ( వ్యంజన్ ) – హల్లులు ( consonants)
Hindi Alphabet:The set of letters used in writing a language is called the Hindi Alphabet.ఒక భాషను వ్రాయటానికి ఉపయోగించే అక్షరాలను అక్షరమాల Alphabet అంటారు .
व्यंजन ( వ్యంజన్ ) – హల్లులు ( consonants)
 www.Pavi Academy.com
व्यंजन ( వ్యంజన్ ) – హల్లులు

These 33 letters are called consonants.

ఈ 33 అక్షరాలను హల్లులు అంటారు .

इन तैतीस 33 अक्षरों ने व्यंजन कहते हैं |

Note : గమనిక :

The fact is k, kh … is the consonants. But the Pollulu included in the affair are treated as consonants.

The consonants are not pronounced  without the help of vowels.

 

వాస్తవానికి   క్ , ఖ్   … అనునవే  హల్లులు . కానీ వ్యవహారంలో చేర్చబడిన పొల్లులే హల్లులుగా వ్యవహరించబడును .

అచ్చులు సహాయం లేకుండా హల్లులు ఉచ్ఛరించబడవు.

 

స్పర్శ వర్ణములు : అంతస్టములు :

స్పర్శ వర్ణములను  పలికినప్పుడు నాలుక అంగిలికి తాకుతుంది . అందువల్ల వీటిని అంతస్టములు అని అంటారు .

అంతస్టములు  :     య   ,   ర   ,   ల   ,   వ

                                   ,   र       , ल   ,    व

ఊష్మములు : ఊష్మములను పలికినప్పుడు ఒక రకమైన శబ్దము వస్తుంది .

ఊష్మములు  :      శ     ,   ష   ,   స   ,  హ

     श   ,    ष   ,    स   ,    ह

 

उभयाक्षर ( ఉభయాక్షర్ ) – ఉభయాక్షరములు ( compound letters)

or

संयुक्ताक्षर  ( సంయుక్తాక్షర్ ) – సంయుక్తాక్షరములు (compound letters)
 www.Pavi Academy.com
संयुक्ताक्षर ( సంయుక్తాక్షర్ ) – సంయుక్తాక్షరములు (compound letters)

 

अभ्यास  ( అభ్యాస్ ) – అభ్యాసం

A combination of vowels and consonants can cause some simple sounds that can be combined with different consonants.

Telugu is the Azantha language, but the Hindi halantha language.

So अ sound is not pronounced the end of the sound in Hindi.

అచ్చులు , హల్లుల కలయిక వల్లగాని , విభిన్న హల్లుల  కలయిక వల్లగాని  కొన్ని సరళమైన  శబ్దములు  ఏర్పడును .

తెలుగు  అజంత భాష , కానీ హిందీ  హలంత భాష .

కనుక  హిందీలో శబ్దం చివరనున్న  अ  కారము  ఉచ్ఛరించబడదు .

ʽ अघ ʼ అను  శబ్దమును  ʽ అఘ ʼ గా కాకుండా  ʽ అఘ్ ʼ  గా  ఉచ్చరించాలి .

 

अब = అబ్ = ఇప్పుడు                                   

ऊन = ఊన్ = ఉన్ని

एक = ఏక్ = ఒకటి

ऐब = ఏబ్ = దోషం

ओप = ఓప్ = కాంతి 

ओर = ఓర్ = వైపు 

आन = ఆన్ = మర్యాద

आम = ఆమ్ = మామిడి 

आह = ఆహ్ = నిట్టూర్పు

इह = ఇహ్ = ఈ

ईख = ఈఖ్ = చెరకు

ईश = ఈశ్ = ఈశ్వరుడు

कब = కబ్ = ఎప్పుడు

कम= కమ్ = కొంచెం 

कर = కర్ = చేయి

कल = కల్ = రేపు , నిన్న

कह = కహ్ = చెప్పు

खर = ఖర్ = గాడిద

गच = గచ్ = గచ్చు చేసిన నేల

गज = గజ్ = ఏనుగు

घट = ఘట్ = కుండ

घर = ఘర్ = ఇల్లు

चल = చల్ = నడచు

छल = ఛల్ = మోసం 

जल = జల్ = నీరు

झख = ఝఖ్ = చేప

डट = డట్ = గుర్తు

डर = డర్ = భయం 

ढप = డప్ = డప్పు 

तन = తన్ = శరీరం 

धन = ధన్ = ధనము

फन = ఫన్ = పాము పడగ

मन = మన్ = మనస్సు

बम = బమ్ = బాంబు

रण = రణ్ = యుద్ధం 

लट = లట్ = కేశపాశం

यश = యశ్ = కీర్తి

वश = వశ్ = వశము

शर = శర్ = బాణం

सर = సర్ = తల

हल = హల్ = నాగలి

बारह्खडी     का    चिह्न  / मात्रा ( బారహ్ ఖడీ  కా చిహ్న్   )

గుణింత చిహ్నములు .

ि

 

అం

అః

 

 

बारह्खडी ( బారహ్ ఖడీ ) = గుణింతం ( grouping )

Hindi Alphabet Rules : There are groupings even in Hindi Similar to Telugu .

తెలుగు మాదిరిగానే హిందీలో కూడా గుణింతాలు వున్నాయి

बारह्खडी  : grouping :

అచ్చులు పొల్లుల ( హల్లుల మూల రూపముల ) తో కలిసినప్పుడు  గుణింతం  ( बारह्खडी  ) ఏర్పడుతుంది.

క్ + అ  =  క

क् + –  =  क

క్ + ఎ / ఏ = కె / కే

क् + े  = के

క్  + ఆ  =  కా

क् + ा  =  का

క్ + ఐ = కై

क् + ै   = कै

క్ + ఇ = కి

क् + ि  = कि

క్ + ఓ = కొ / కో

क् + ो  = को

క్ + ఈ = కీ

क् + ी = की

క్ + ఔ  = కౌ

क् + ौ = कौ

క్ + ఉ = కు

क् + ु  = कु

క్ + అం = కం

क् + ं  = कं

క్ + ఊ = కూ

क् + ू  = कू

క్ + అః = కః

क् + ः  = कः

క్ + ఋ = కృ

क् + ृ  = कृ

 

 

 

 

 

बारह्खडी ( బారహ్ ఖడీ ) = గుణింతం ( grouping )

పొల్లు ि

ka

का

కా

ka

कि

కి

ki

की

కీ

kee

कु

కు

ku

कू

కూ

koo

कृ

కృ

kru

के

కె

ke

कै

కై

kai

को

కొ

ko

कौ

కౌ

kou

कं

కం

kam

कः

కః

kah

kha

खा

ఖా

kha

खि

ఖి

khi

खी

ఖీ

khee

खु

ఖు

khu

खू

ఖూ

khoo

ఖృ

khru

खे

ఖె

khe

खै

ఖై

khai

खो

ఖొ

kho

खौ

ఖౌ

khou

खं

ఖం

kham

खः

ఖః

khah

ga

गा

గా

ga

गि

గి

gi

गी

గీ

gee

गु

గు

gu

गू

గూ

goo

गृ గృ

gru

गे

గె

ge

गै

గై

gai

गो

గొ

go

गौ

గౌ

gou

गं

గం

gam

गः

గః

gah

note : ఇతర హల్లుల గుణింతం పై మాదిరిగానే వ్రాయవచ్చు .

अभ्यास  ( అభ్యాస్ ) – అభ్యాసం

దీర్ఘం ( ा )

काम = కామ్ = పని

राम = రా మ్ = రాముడు

चाय = చాయ్ = తేనీరు

पाय = పాయ్ = అడుగు

हाथ = హాథ్ = చేయి

साथ = సాథ్ = తోడు

कथा = కథా = కథ

तथा = తథా = మరియు

गाथा = గాథా = కథ

माया = మాథా = తల

शाला = శాలా = పాఠశాల

हाला = హాలా = మద్యం

గుడి ( ि )

खिल = ఖిల్ = వికసించు

तिल = తిల్ = నువ్వులు

दिल = దిల్ = హృదయము

बिल = బిల్ =  పుట్ట / కన్నం

थिर = థిర్ = స్థిరము

फिर = ఫిర్ = మరలా

सिर = సిర్ = తల

मिस = మిస్ = నెపం

रिस = రిస్ = క్రోధం

कपि = కపి = కోతి

मणि = మణి = రత్నం

पति = పతి = భర్త

मति = మతి = బుద్ధి

यति = యతి = యోగి

तिथि = తిథి = తిథి

मलिन = మలిన్ = మురికియైన

फटिक = ఫటిక్  = పటిక

గుడి  దీర్ఘం (ी )

कील = కీల్ = గూటం

नील = నీల్ = నీలి రంగు

बीन = బీన్ = వీణ

मीन = మీన్ = చేప

पीस = పీస్ = పిండి చేయు

बीस = బీస్ = ఇరవై

कीप = కీప్ = గరాటు

सीप = సీప్ = ముత్యపు చిప్ప

खीर = ఖీర్ = పాయసం

तीर = తీర్ = బాణం

छील = చీల్ = చీల్చు

झील = ఝీల్ = సరస్సు

कली = కలీ = మొగ్గ

गली = గలీ = వీధి

घड़ी = ఘడీ = గడియారం

लड़ी = లడీ = హారం

करीब = కరీబ్ = సుమారు

मरीज = మరీజ్ = రోగి

కొమ్ము ( ु )

कुल = కుల్ = మొత్తం

पुल = ఫుల్  = వంతెన

घुन = ఘున్ = కొయ్య పురుగు

धुन = ధున్ = నిష్ఠ

टुक = టుక్ =  కొంచెం  

शुक = శుక్ = చిలుక

कुछ = కుఛ్ = కొంచెం

चुप = చుప్ = మౌనం

छुत = ఛుత్ = ఆకలి 

जुग = జుగ్ = యుగం

दुम = దుమ్  =తోక

सुख = సుఖ్ = సుఖం

पुलक = పులక్ = రోమాంచం

सुबह = సుబహ్ = ప్రాతః కాలం

 नकुल = నకుల్ = నకులుడు

कुकुर = కుకుర్ = కోడిపుంజు

कुमुद = కుముద్ = తెల్ల కలువ

मुकुट = ముకుట్ = కిరీటం

కొమ్ము దీర్ఘం ( ू )

पूत = పూత్ = పుత్రుడు

सूत = సూత్ = నూలు

चूर = చూర్ = చూర్ణం

शूर = శూర్ = శూరుడు

कूप = కూప్ = బావి

धूप = ధూప్ = ఎండ

सूप = సూప్ = చేట

फूल = ఫూల్ = పూలు

मूल = మూల్ = మూలం

शूल = శూల్ = ముల్లు

खून = ఖూన్ = రక్తం

चूक = చూక్ = తప్పు

झूठ = ఝూట్ = అబద్ధం

थून = థూన్ =స్తంభం 

रूई = రూఈ = దూది

सूद = సూద్ = వడ్డీ

लू = లూ = వడగాలి

मूसल = మూసల్ = రోకలి

पूरब = పూరబ్ = తూర్పు 

मसूर = మసూర్ = ఒక విధమైన పప్పు

सलूक = సలూక్ = వ్యవహారం

 ఋత్వం   (ृ)

गृह = గృహ్ = గృహం

मृग = మృగ్ =జింక

वृक = వృక్ = తోడేలు

पृथक = పృథక్ = వేరుగా

बृहत = బృహత్ = గొప్ప

सृजन = సృజన్ = సృష్టి

हृदय = హృదయ్ = హృదయం  

ఎత్వం / ఏత్వం ( े )

खेल = ఖేల్ = ఆట

जेल = జేల్ = జైలు

तेल = తేల్ = నూనె

पेट = పేట్ = పొట్ట

पेड़ =పేడ్ = చెట్టు

नेह = నేహ్ = ప్రీతి

सेब = సేబ్ = ఆపిల్

तेज = తేజ్ = పరాక్రమం

खेत = ఖేత్ = పొలం

मेघ = మేఘ్ =మేఘం

बेल = బేల్ =తీగ

हेय = హేయ్ = నికృష్టమైన

सेहत =  సేహత్ = ఆరోగ్యం

खलेल = ఖలేల్ = నూనెమడ్డి

फुलेल = ఫులేల్ = సువాసన గల నూనె

 

 

ఐత్వం (ै)

गैर = గైర్ = పరాయి వాడు

तैर = తైర్ = ఈదు

पैर = పైర్ = అడుగు

वैर = వైర్ = విరోధం

सैर = సైర్ = షికారు

कैद = కైద్ = జైలు శిక్ష

गैल = గైల్ = దారి

तैल =  తైల్ = నూనె

शैल = శైల్ = పర్వతం

सैल = సైల్ = వరద

पैदल = పైదల్ = కాలి నడకన

बैठक = బైటక్ = సమావేశం

मैला = మైలా = మలినమైన

हैबर = హైబర్ = మంచి గుర్రం

ఒత్వం / ఓత్వం ( ो )

कोख = కోఖ్ = గర్భకోశం

सोख = సోఖ్ = పీల్చు

मोच = మోచ్ = బెణుకు

लोच = లోచ్ = కోమలత్వం

चोट = చోట్ = దెబ్బ 

लोट = లోట్ = పొర్లు

कोप = కోప్ = కోపం

रोप = రోప్ =నాటు

रोग = రోగ్ = రోగం

लोग = లోగ్ = ప్రజలు

चोर = చోర్ = దొంగ

मोर = మోర్ = నెమలి

शोर = శోర్ = అల్లరి

गोल = గోల్ = గుండ్రని

बोल = బోల్ = మాట్లాడు

डोल = డోల్ = ఊయల

कोह  = కోహ్ = పర్వతం  

बोतल = బోతల్ = సీసా

डोलक = డోలక్ = మృదంగం వంటి వాద్యం

लोलक = లోలక్ = లోలాకు

करोड़ = కరోడ్ = కోటి

ఔత్వం (ौ)

जौ = జౌ = యవలు

पौ = పౌ = చలివేంద్రం

सौ = సౌ = వంద

चौक = చౌక్ = నాలుగు వీధుల కూడలి

जौक = జోక్ = గుంపు

शौक = శౌక్ = అభిరుచి

कौन = కౌన్ = ఎవరు

लौन = లోన్ = ఉప్పు

कौम = కౌమ్ = జాతి

गौद = గౌద్ = గుత్తి

गौर = గౌర్ = ధాన్యం

घौद = ఘౌద్ = పళ్ళ గెల

डौल = డౌల్ = పద్ధతి  

तौल = తౌల్ = త్రాసు  

दौर = దౌర్ = పర్యటన

धौत = ధౌత్ = వెండి

बौर = బౌర్ = మామిడి చిగురు

नौकर = నౌకర్ = నౌకరు

चौसर = చౌసర్ = పాచికల ఆట

फौरन = ఫౌరన్ = వెంటనే

मौसम = మౌసమ్ = ఋతువు

సున్న ( ं )

कंज = కంజ్ = కమలం

कंत = కంత్ = భర్త

गंज = గంజ్ = ధాన్యపు మార్కెట్టు

मंच = మంచ్ = ఎత్తుగా కట్టబడిన మండపం

पंख = పంఖ్ = రెక్కలు

दंड = దండ్ = దండన

पंथ = పంథ్ = మార్గం

रंग = రంగ్ = రంగు

संत = సంత్ = సాధువు

हंस = హంస్ = హంస

कंचन = కంచన్ = బంగారం

कंपन = కంపన్ = కంపనం

बंदर = బందర్ = కోతి

मंगल = మంగల్ = మంగళం

मंथन = మంథన్ = చిలుకుట  

संकट = సంకట్ = సంకటం

अनंत = అనంత్ = అనంతం

విసర్గ ( ः )

अतः = అతః = దీనివల్ల

दुःख = దుఃఖ్ = దుఃఖం

विविध ( వివిద్ ) – వివిధములు

केला = కేలా = అరటి

चेला = చేలా = శిష్యుడు

शिला  = శిలా = రాయి

खीरा = ఖీరా = దోసకాయ

मीठा = మీఠా = తియ్యని

कुली = కులీ = కూలివాడు

नूपुर = నూపుర్ = గజ్జెలు

कृपा = కృపా = దయ

कृषि = కృషి = వ్యవసాయం

कैसा = కైసా = ఎలాంటి

पैसा = పైసా = పైసా

चैला = చైలా = వంట చెరకు

कोना = కోనా = మూల

नौका = నౌకా = నౌక

कंधा = కంధా = భుజం

गंगा = గంగా = గంగ

पंखा = పంఖా = విసన కర్ర

दिलेरा = దిలేరా = ధైర్యం కలవాడు

मीनाक्षी = మీనాక్షీ = మీనాక్షీదేవి

खेलना = ఖేల్ నా = ఆడుట  

कोकिल = కోకిల్ = కోకిల

कौपीन = కౌపీన్ = గోచి

 

 

 

 

 

 

द्वित्वाक्षर (ద్విత్వాక్షర్ )  – ద్విత్వాక్షరములు  (double letters)

Hindi Alphabet with double letters :

द्वित्वाक्षर : double lettersఒక హల్లు అక్షరం క్రింద అదే హల్లు యొక్క వత్తును వ్రాసినట్లయితే దానిని ద్విత్వాక్షరము ( द्वित्वाक्षर ) అని అంటారు .

క్ + క = క్క

क् + क = क्क

జ్ +జ = జ్జ

ज + ज = ज्ज

గ్ + గ = గ్గ

ग + ग = ग्ग

న్ +న = న్న

न + न = न्न

చ్ +చ = చ్చ

च + च = च्च

 

 

 

अभ्यास  ( అభ్యాస్ ) – అభ్యాసం

पक्का = పక్కా = ధృడమైన

मक्का = మక్కా = మక్కా నగరము

कच्चा = కచ్చా = పండని

बच्चा= బచ్చా = బాలుడు

लग्गा = లగ్గా = పొడుగాటి బొంగు

सुग्गा = సుగ్గా = చిలుక

चट्टा = చట్టా = వెదురు చాప

पट्टा = పట్టా = ఆస్తి పట్టా

अड्डा = అడ్డా = బస్సులు మొ వి  ఆగు చోటు

चड्डी = చడ్డీ = చడ్డీ

लड्डू = లడ్డూ = లడ్డు

 

छज्जा = ఛజ్జా = ఇంటి చూరు  

लज्जा = లజ్జా = సిగ్గు

पत्ता = పత్తా = ఆకు

खत्ता = ఖత్తా = పాతర

सत्ता = సత్తా = శక్తి

भद्दा = భద్దా = కురూపియైన

जद्दा = జద్దా = నాయనమ్మ

अम्मा = అమ్మా = అమ్మ

भय्या = భయ్యా = సోదరుడు

दुस्साहस =  దుస్ సాహస్ = చెడు సాహసం

Learn Hindi Alphabet by paviacademy

Learn Hindi Alphabet from Telugu

Thanks for reading this article ” Hindi Alphabet “. I Hope you liked it. Give feed back, comments and please share this article.

 

Post Author: Pavi Academy

Avatar photo

6 thoughts on “Hindi Alphabet Learn from  Telugu language

    siva

    (August 17, 2018 - 4:54 pm)

    Good information, Thank you Sir

    Srinivas

    (February 5, 2019 - 3:24 pm)

    Super hindi

    Srinivas

    (February 5, 2019 - 3:29 pm)

    Sir mee phone number pettandi maaku books kaavali

    Sudhakar Konnipati

    (April 4, 2020 - 5:04 pm)

    Good

    Sudhakar konnipati

    (April 7, 2020 - 3:12 pm)

    Good lessons for hindi learners

    Sudhakar

    (April 15, 2020 - 1:50 am)

    Very good lessons for learners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *