Kinds of Nouns and English Grammar learn from Telugu language .
The Noun : నామవాచకము :
A noun is a word used as the name of a person , place or thing .
వ్యక్తులు లేదా స్థలములు లేదా జంతువులు లేదా వస్తువులు లేదా గుణములు మొదలైన వాటి పేర్లను సూచించే పదాలను (నామవాచకాలు ) అంటారు.
Examples :
1 : Names of persons (వ్యక్తుల పేర్లు ) : Rama , Krishna , boy , man , girl , women etc .
2 : Names of places (స్థలముల పేర్లు) : Vijayawada , Hyderbad , Delhi , river , mountain , city , town , etc .
3 : Names of things (వస్తువుల పేర్లు) : Box , pen , pencil , crowd , mob , team , goodness , wisdom , laughter , childhood , science , etc .
Note : The word ‘thing’ includes :
1 : All objects that we can see , hear , taste , touch or smell .
2 : Some thing that we can think of but can not perceive by senses .
ఈ నిర్వచనములో thing (వస్తువు ) అనే పదము విశాలార్ధంలో వాడబడినది .
1: మనం చూసేవి అన్నీ , విన గలిగినవి అన్నీ, రుచి చూసేవి అన్నీ , తాక గలిగినవి అన్నీ, వాసన చూడగలిగినవి అన్నీ ఇది సూచిస్తుంది .
2 : అంతే కాదు ఇంద్రియ జ్ఞానముచే గ్రహింపలేక పోయినప్పటికీ మనము ఆలోచింపగల లేక భావింపగల వాటిని కూడ ఇది తెలియజేస్తుంది .
1 : KINDS OF NOUNS – నామవాచకములోని రకాలు
1 : How many kinds of Nouns are there in English ? What are they ?
♦ Nouns are of 5 kinds : నామవాచకములు 5 రకాలు.
1 : Proper noun : సంజ్ఞా నామవాచకము
2 : Common noun : జాతి నామవాచకము
3 : Collective noun : సముదాయ నామవాచకము
4 : Material noun : ద్రవ్య నామవాచకము
5 : Abstract noun : గుణ నామవాచకము
2 : What is a Proper noun ? ( give examples )
♦ Proper noun : సంజ్ఞా నామవాచకము :
A Proper Noun is the name of some particular person or place.
ఒక ప్రత్యే క వ్యక్తి లేదా ప్రదేశమునకు చెందిన పేరును తెలిపే పదమును సంజ్ఞా నామవాచకము అంటారు .
Examples :
- Names of persons : Rama , Krishna , Hari etc .
- Names of places : Vijayawada , Bombay , New Delhi etc .
3 : What is a Common Noun ?
♦ Common Noun : జాతి నామవాచకము :
A Common Noun is a name given in common to every person , place or thing of the same class or kind.
ఒకే తరగతి లేదా జాతికి చెందిన వ్యక్తికి లేదా స్థలమునకు లేదా వస్తువునకు సామాన్యముగా వుండే పేరును జాతి నామవాచకము అంటారు .
Examples :
- Names of persons : boy , girl , child , man , woman etc .
- Names of places : town , village , city , river , country etc .
- Names of things : pen , pencil , book , chair etc .
4 : What is a Collective Noun ?
♦ Collective Noun : సముదాయ నామవాచకము :
A Collective Noun is the name of a number or collection of persons or things taken together and spoken of as one whole .
మనుష్యుల యొక్క గుంపును లేదా , కొన్ని వస్తువుల యొక్క సముదాయమును గాని ఏకంగా ఒక్క పదంలో తెలియజేయు పదాలను సముదాయ నామవాచకములు అని అంటారు .
Examples :
Crowd , mob , team , fleet , army , jury , family , nation , parliament , committee etc .
5 : What is a Material Noun ?
♦ Material Noun : ద్రవ్య నామవాచకము :
A Material Noun is the name of some material or substance which is supposed to have no separate parts .
ద్రవ్యము లేదా పదార్ధము పేరును తెలిపే పదమును ద్రవ్య నామవాచకము అంటారు .
Examples :
Rice , sand , clay , iron , gold , silver , milk , water , oil etc .
6 : What is an Abstract Noun ?
♦ Abstract noun : గుణ నామవాచకము :
An abstract noun is the name of a quality , action or state .
ఒక గుణమును గాని , క్రియను గాని , స్థితిని గాని సూచించే పదమును Abstract noun ( గుణ నామవాచకము ) అంటారు .
Examples :
- Quality : Goodness , kindness , honesty , wisdom , bravery .
- Action : Theft , movement , judgement .
- State : Childhood , boyhood , slavery , sleep , poverty .
The names of Arts and Science are also Abstract Nouns .
కళలు , శాస్త్రాల పేర్లను కూడ Abstract Nouns అంటారు .
Examples :
Grammar , music , physics , chemistry , economics , politics etc .
2 . CONCRETE NOUN AND ABSTRACT NOUN
Nouns can also be classified as
- Concrete Noun 2 . Abstract Noun.
నామవాచకములను 1) Concrete Nouns 2 ) Abstract Nouns అని 2 రకాలుగా విభజించారు .
7 : What are Concrete Nouns ?
♦ Concrete Nouns : మూర్త నామవాచకములు :
Names of persons , places or things that we can see or touch are called Concrete Nouns.
మనము చూడగల లేక తాకగల మనుష్యుల , ప్రదేశముల లేక వస్తువుల పేర్లను Concrete Noun ( మూర్త నామవాచకములు ) అంటారు .
Examples :
Ravi , Vijayawada , city , tree , table , water , gold .
8 : What are Abstract Nouns ?
♦ Abstract Nouns : అమూర్త నామవాచకములు :
Names of things that we can only think of , but cannot touch or see are called Abstract Nouns.
మనము చూడలేని లేక తాకలేని వస్తువుల పేర్లను అంటే కేవలం భావింపగల వస్తువుల లేక భావముల పేర్లను అమూర్త నామవాచకములు అంటారు .
Examples :
Beauty , patience , youth , death , logic , astronomy , physics , politics etc .
3 : COUNTABLE AND UNCOUNTABLE NOUNS
Nouns can also be classified as [1] Countable Noun and [2] Uncountable Noun .
నామవాచకములను [1] Countable Noun [2] Uncountable Noun గా విభజించారు .
9 : What are Countable Nouns ?
♦ Countable Nouns : గణ్య నామవాచకములు :
Names of thing, places or persons that can be counted are called Countable Nouns .
లెక్క పెట్టడానికి వీలున్న పేర్లను గణ్య నామవాచకములు అని అంటారు .
Examples :
Pen, tow pens, box, -tow boxes, city-tow cities country-tow countries, box-tow boys, man-three men , woman-three women, girl- four girls. Etc.
10 : What are Uncountable Nouns ?
♦ Uncountable Nouns : అగణ్య నామవాచకములు :
Names of thing that cannot be counted are called Uncountable Noun.
లెక్కింపవీలుకాని వస్తువుల పేర్లను అగణ్య నామవాచకములు అంటారు .
Examples :
Tea , coffee, milk, sugar, ink, rice, gold, air, happiness, whiteness, brightness, etc.