Contents
Parts of speech in English learn from Telugu language and learn English Grammar through Telugu.
Parts of speech : భాషా భాగములు:
Words are divided into different kinds or classes according to their use i.e the work they do in a sentence.
They are called parts of speech.
వాక్యములో ప్రతీపదము చేసే పనిని బట్టి ఆ పదాలను వివిధ రకాలుగా విభజించారు . ఆ రకములను Parts of speech (భాషా భాగములు ) అంటారు.
There are 8 parts of speech in English .
ఇంగ్లీషులో భాషాభాగములు 8 రకాలు . అవి :
- Noun (నామవాచకము)
- Pronoun (సర్వనామము)
- Adjective (విశేషణము)
- Verb (క్రియ)
- Adverb (క్రియావిశేషణము)
- Preposition (విభక్తి పదము)
- Conjunction (సముచ్చయము)
- Interjection ( ఆశ్చర్యార్థకము)
-
Noun (నామవాచకము) :
A noun is a word used as the name of a person , place or thing.
వ్యక్తులు లేక స్థలములు లేక జంతువులు లేదా వస్తువులు లేదా గుణములు మొదలైన వాటి పేర్లను సూచించే పదాలను Nouns (నామవాచకాలు ) అంటారు.
Eg : : Raju , Ravi , Krishna , ganga
Kakinada , Rajahmundry , hyderabad
Fox , Dog , Camel , Lion
Gold , Pen , Pencil
2: pronoun (సర్వనామము) : A pronoun is a word , used in the place of a noun .
నామవాచకమునకు బదులుగా వాడబడిన పదమును Pronoun (సర్వనామము) అంటారు.
Examples
He ,She , It …
1: The cow loves its calf
2: Rama did not go to school yesterday , because he was ill.
పై వాక్యాలలో cow కు బదులుగా వాడబడిన its , Rama కు బదులుగా వాడబడిన he సర్వనామములు ( pronouns ) .
- Adjective : విశేషణము : An adjective is a word used to add something to the meaning of a noun.
ఒక నామవచాకమును విశేషించే మాటను adjective (విశేషణం) అంటారు.
Examples
good boy , white cat , blue …
1 : Rama is a good boy.
2: The sky is blue.
పై వాక్యములో boy అనే నామవచకమును విశేషించే good అనే పదమూ, sky అనే నామవచకమును విశేషించే blue అనే పదమూ విశేషణములు (adjectives).
-
Verb : క్రియ: A verb is a word used to say something about a noun.
నామవచకమును గురించి చెప్పే పదమును Verb (క్రియ) అని అంటాము . (లేక ) పనులను ,
స్దితులను గూర్చి చెప్పే పదములను Verbs (క్రియలు) అంటారు .
Examples
Go , come , do ……..అనే మాటలు క్రియలు (verbs)
1 : Birds fly.
2: Fishes swim.
పై వాక్యములో fly , swim అనే మాటలు క్రియలు ( verbs ) .
- Adverb (క్రియా విశేషణము) : An adverb is a word used to add something to the meaning of a verb , an adjective or another adverb .
ఒక క్రియను గాని , విశేషణమును గాని లేదా ఇంకొక క్రియా విశేషణమును గాని విశేషించే పదమును adverb (క్రియా విశేషణము) అంటారు.
Examples
1.he worked the sum quickly.
2.the flower is very beautiful.
3.she pronounced the word quite correctly.
1.మొదటి వాక్యంలో quickly అనే పదం worked అనే verbను విశేశిస్తున్నది అంటే అతడు లెక్క (sum)ను ఎంత తొందరగా చేశాడో చెప్తున్నది.కాబట్టి అది adverb.
2.రెండో వాక్యంలో very అనే పదము beautiful అనే adjectiveను వివరిస్తుంది . అంటే పువ్వు ఎంత అందంగా ఉన్నదో తెలియజేస్తుంది . కాబట్టి అది adverb.
3 . మూడో వాక్యంలో quite అనే పదము correctly అనే ఇంకొక పదమును విశేషిస్తున్నది.ఈ correctly అనే పదము pronounced అనే verbను విశేషిస్తున్నది. కాబట్టి quite , correctly అనే 2 పదములు కూడా adverbs .
-
Preposition : విభక్తి పదము : A preposition is a word used to exhibit the relation between a noun or a pronoun and every other phrase in a sentence .
వాక్యంలోని ఇతర పదముతో ఒక నామ వాచకమునకు లేక సర్వనామమునకు గల సంబంధమును తెలిపే పదమును preposition (విభక్తి పదము) అంటారు.
Examples
1.the cow is in the field.
2.the book is on the table.
1.మొదటి వాక్యంలో cow (ఆవు)కు field (పొలము) కు గల సంబంధమును In తెలుపుతున్నది.
2.రెండో వాక్యంలో book కు table కు గల సంబంధమును on తెలుపుతున్నది. అందువల్ల In , on లు prepositions . Preposition తరువాత ఉండే Noun ను లేదా pronoun ను prepositional object అంటారు. అది ఎప్పుడు objective case లోనే ఉండాలి.
7 . Conjunction : సముచ్చయము : A conjunction is a word used to join words , phrases or clauses .
Conjunctions are joining words .
పదాలను , ఉప వాక్యాలను కలిపే పదాలను Conjunctions ( సముచ్చయములు ) అని అంటారు .
Examples
- Ravi and Hari are good friends
- To fight or give up – that is what we have to decide .
- He ran fast but missed the train .
పై వాక్యములో And , or , but అనేవి conjunctions .
8 . Interjection ; ఆశ్యర్యార్ధకము : An interjection is a word used to express some sudden feeling.
హఠాత్తుగా కలిగిన ఆశ్చర్యం , దుఃఖం , సంతోషం మొదలైన భావములను తెలియజేసే పదములను Interjections ( ఆశ్యర్యార్ధకములు ) అంటారు .
Examples
- Hurrah ! we won the game .
- Alas ! she is dead .
పై వాక్యములో Hurrah ! , Alas ! అను పదములు Interjections .