Personal Pronouns Rules | English Grammar

This paviacademy.com article is about Personal Pronouns Rules For Academic and Competitive Examinations With Telugu explanation

Personal Pronouns Rules For Academic and Competitive Examinations– అన్ని తరగతుల పరీక్షలకు – అన్ని పోటీ పరీక్షలకు – తెలుగు వివరణతో – ఇంగ్లీష్ వ్యాకరణము-paviacademy
Personal Pronouns Rules – English Grammar – paviacademy

Use of personal Pronouns:

1. The personal pronoun must be of the same number , gender and person as the Noun for which it stands .

  • ఒక personal pronoun ఏ నామవాచకము ( noun ) నకు బదులుగా వాడబడుతుందో , ఆ నామవాచకము యొక్క వచనము ( number ) లింగము ( gender ) పురుష ( person ) లలో ఉండాలి .

Examples : ఉదాహరణ :

  • Ravi is a clever student = రవి ఒక తెలివైన విద్యార్ధి
  • He won the first Prize = అతను మొదటి బహుమతిని గెలుచుకున్నాడు
  • Sitha sings well . she has a golden voice .= సీత బాగా పాడుతాది . ఆమెకు బంగారు గాత్రం ఉంది.
  • The dog has a chain around its neck .= కుక్క దాని మెడ చుట్టూ గొలుసును కలిగి ఉంది.
  • They refuse to work for their living . = వారు తమ జీవనశైలి కోసం పని చేయరు.

            పై వాక్యంలో ‘Ravi ‘ అనే నామవాచకము (noun ) Third person , singular number , Masculine Gender లో ఉన్నది .    అదేవిధంగా దానికి బదులుగా వాడబడిన ‘he‘ అనే సర్వనామము ( pronoun ) కూడ  Third person , Singular Number , Masculine Gender లోఉన్నది .  అదేవిధంగా మిగిలిన వాక్యాలలోని నామవాచకములు ( Sitha , dog , begger ) వాటికి బదులుగా వాడబడిన సర్వనామములు   ( she , its , they ) ఒకే వచనము ఒకే లింగము , ఒకే పురుషలలో ఉన్నవి .

2.when two or more singular nouns are joined by ‘and’ the pronoun used for then must be plural .

  • రెండు లేక అంతకంటే ఎక్కవ ఏకవచనములో ఉన్న నామవాచకములు ‘ and ‘ చే కలుపబడినప్పుడు వాటికి బదులుగా వాడబడిన సర్వనామము   ( pronoun ) బహువచనములో ఉండాలి .

Examples : ఉదాహరణ :

  • Rama and hari were praised by their teacher . = రాముడు మరియు హరి వారి గురువుచే ప్రశంసించబడ్డారు.
  • Both sitha and sarada have gone to their homes. = సీత మరియు శారదా ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్ళారు.

3.when two or more singular nouns are joined by ‘and’ refer to the same person or thing , the pronoun used for them must be in the singular .

  • and ‘ చే కలుపబడిన రెండు లేక అంతకంటే ఎక్కవ ఏకవచనములో ఉన్న నామవాచకములు ఒకే వ్యక్తిని లేదా వస్తువును సూచిస్తున్నప్పుడు , వాటికి బదులుగా వాడబడిన సర్వనామము ( pronoun ) ఏకవచనములో ఉండాలి .

Example : ఉదాహరణ :

  • The secretary and treasurer is negligent of his duty .

ఈ  వాక్యంలో  Secretary  ,  Treasurer  పనులకు  ఒక  వ్యక్తే  నిర్వహిస్తున్నాడు .  అందువల్ల  ఆ  రెండింటికీ  బదులుగా  వాడబడిన  సర్వనామము  ‘ his ‘  ఏకవచనములో  ఉన్నది .

  • The District Magistrate and Collector has sent his report.= జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ తన నివేదికను పంపారు.

ఈ వాక్యంలో District Magistrate మరియు Collector పనులను ఒకే వ్యక్తే నిర్వహిస్తున్నాడు . అందువల్ల వాటికి బదులుగా వాడబడిన ‘ his ‘ ఏకవచనములో ఉన్నది .

4.when two singular nouns joined by ‘and’ are preceded by ‘ each ‘ or ‘every’ the pronoun must be in the singular .

  • And’ చే కలుపబడిన రెండు నామవాచకముల ముందు ‘ each ‘ గాని ‘every’ గాని ఉంటే , సర్వనామము ఏకవచనములో ఉండాలి .

Example : ఉదాహరణ :

  • Every sailor and ever soldier was in his place.= ప్రతి నావికుడు మరియు ఎప్పుడూ సైనికుడు అతని స్థానంలో ఉన్నారు.
  • Each man and each woman cast his or her vote for you.

5.when two or more singular nouns are joined by ‘or’ ‘ either…or ‘ , ‘ neither…nor ‘ , the pronoun must be in the singular .

  • రెండు లేక అంతకంటే ఎక్కవ ఏకవచన నామవాచకములు లేక either…or , neither…nor తో కలుపబడినప్పుడు వాటికి బదులుగా వాడబడిన సర్వనామము ( pronoun ) ఏకవచనములో ఉండాలి .

Example : ఉదాహరణ :

  • Ravi or hari must give his pen.= రవి లేదా హరి తన కలం ఇవ్వాలి.
  • Either Krishna or Gopal forgot to take his bag.= కృష్ణుడు లేదా గోపాల్ తన బ్యాగ్ తీసుకోవడం మరచిపోయాడు.
  • Neither sarala nor sarada has done her lesson.= సరళ లేదా శారదా ఆమె పాఠం చేయలేదు

6.when a pronoun stands for a Collective Noun,it must be in singular (and neuter gender) if the collective noun is viewed as a whole.

  • Collective Noun ఏక మొత్తముగా భావింపబడినప్పుడు దానికి బదులుగా వాడబడిన సర్వనామము ( pronoun ) ఏకవచనములో ఉండాలి .

Example : ఉదాహరణ :

  • The jury gave its verdict.= జ్యూరీ దాని తీర్పును ఇచ్చింది.
  • The fleet reached its destination.= నౌకాదళం దాని గమ్యాన్ని చేరింది.
  • The crew mutinied and murdered its officers.

7. If the collective Noun conveys the idea of separate individuals comprising the whole,the pronoun stands for it should be in the plural number.

  • ఒక సముదాయ నామవాచకము (Collective Noun) దానిలోని వ్యక్తులను లేక వస్తువులను విడివిడిగా సూచిస్తున్నప్పుడు , దానికి బదులుగా వాడబడిన సర్వనామము ( pronoun ) బహువచనములో ఉండాలి .

Example : ఉదాహరణ :

  • The jury were divided in their opinions.
  • The committee decided the matter without leaving their seats.= ఈ కమిటీ తమ సీట్లను విడిచిపెట్టకుండానే నిర్ణయం తీసుకుంది.

8.when a pronoun refers to more than one noun or pronoun of different persons , it must be of the first person plural (we) in preference to the second (you),and of the second person plural in preference to the third (they).

  • ఒక సర్వనామము ( pronoun ) వేర్వేరు పురుషలలో ఉన్న నామవాచకములను లేదా సర్వనామములను అది సూచించే సర్వనామములు ఉత్తమ , మద్యమ పురుషలలో ఉన్నప్పుడు అది ఉత్తమ పురుష బహువచనము ( we ) లోనూ , అవి మద్యమ , ప్రథమ పురుషలలో ఉన్నప్పుడు అది మద్యమ పురుష బహువచనము (you) లోనూ ఉండాలి .

Example : ఉదాహరణ :

  1. you and I have done our duty.
  2. you and Hari have not done your home work .

మొదటి వాక్యములో ‘ you ‘ అనే second person pronoun కు ‘ I ‘ అని first person pronoun కు బదులుగా ‘ our ‘ అనే first person plural pronoun వచ్చింది .
రెండో వాక్యములో ‘ you ‘ అనే second person pronoun కు ‘ Hari ‘ అని Third person pronoun కు బదులుగా ‘ your ‘అనే second person plural pronoun వచ్చింది .

9.If two or more singular pronouns of different persons some together in a sentence the pronouns of second person come first and the pronouns of first person come last, and the pronouns of third person come in between .

  • రెండు లేక అంత కంటే ఎక్కువ వివిధ పురుషల ( persons ) లో ఉన్న ఏకవచన సర్వనామములు కలిసి వచ్చినప్పుడు ముందు మధ్యమ పురుష సర్వనామములు (second person pronouns) తరువాత ప్రధమ పురుష సర్వనామములు (Third person pronouns) చివరకు ఉత్తమ పురుష సర్వనామములు (First person pronouns) రావాలి .

Example : ఉదాహరణ :

  • You and I must work together .
  • You and Hari must mend your ways.
  • Hari and I are good friends.
  • You , Ravi and I must go there.

10.If two or more plural pronouns of different persons come together the first person plural (we) comes first : next the second person plural (you) , and last of all the third person plural (they).

  • రెండు లేక అంత కంటే ఎక్కువ వివిధ పురుషల ( persons ) లో ఉన్న బహువచన సర్వనామములు (plural pronouns) కలిసి వచ్చినప్పుడు , ముందు ఉత్తమ పురుష బహువచనము ( we ) , తరువాత మధ్యమ పురుష బహువచనము (you) చివరకు ప్రధమ పురుష బహువచనము (they) రావాలి .

Example : ఉదాహరణ :

  • We , you , and they must work together .
  • you , and they should go there .
  • we and you are old school friends .

11 . when a pronoun is used as the object of a verb or of a preposition , it should be in the objective case .

  • ఒక సర్వనామము ( pronoun ) ఒక క్రియ యొక్క లేదా preposition యొక్క object ( కర్మ) గా వాడబడినప్పుడు అది objective case లో ఉండాలి .

Example : ఉదాహరణ :

  • My uncle invited my brother and me to dinner. ( not , i )
  • These presents are for you and me.
  • Between you and me affairs look dark.
  • Let you and me do it.

12. The pronoun following ‘than’ or ‘as’ should be in the same case as the noun or pronoun preceding it or determined by mentally supplying verb.

  • Than ‘ లేక ‘ as ‘ తరువాత వచ్చే సర్వనామము (pronoun) వాటికి ( than లేక as ) ముందు వచ్చే సర్వనామము లేక నామవాచకము case లోనే ఉండాలి . లేదా దాని case ను దాని తరువాత మనం చేర్చే క్రియను బట్టి నిర్ణయించాలి .

Example : ఉదాహరణ :

  • He is taller than I (am)
  • I like better than (I like) him.
  • I like you better than he (likes you).
  • They gave him as much as (he gave ) me.
  • They gave him as much as I (gave him).

Exercise

Fill in the blanks choosing the correct pronouns from the brackets :-

1 The secretary and treasurer is negligent of his duty .  ( his , their ).
2 Ravi or raju must give his book .  ( his , their )
3 Neither ranga nor rama has done his Lesson . ( his , their )
4 The jury gave its verdict .  ( his , its , their )
5 The fleet reached its destination . ( its , their )
6 The jury were divided in their Opinions . ( its , their )
7 You and I have done our duty .  ( our , your )
8 You and hari have not done your homework . ( your , their )
9 He  invited my brother and me To dinner . ( me , I )
10 Between you and me affairs look  dark (I , me )

Related English Lessons:
Lesson . 1 . The English Alphabet
Lesson . 2 . Parts of Speech
Lesson . 3 . Kinds of Nouns
Lesson . 4 . Kinds of Gender
Lesson . 5 . Singular and Plural Rules
Lesson . 6 . Case in English Grammar
Lesson . 7 . Formation of the possessive case Rules
Lesson . 8 . Use of the possessive case Rules
Lesson . 9 . Kinds of Pronouns
Lesson . 10 . list of personal pronouns

Post Author: Pavi Academy

Avatar photo

2 thoughts on “Personal Pronouns Rules | English Grammar

    azmeeraradhika

    (February 12, 2021 - 6:06 pm)

    super excelent job thankyou paviacademy

      Avatar photo

      Pavi Academy

      (March 4, 2021 - 10:00 pm)

      Thank You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *