In this article we are going to know about The English alphabet by Telugu For Academic and Competitive Examinations With Telugu explanation by www.paviacademy.com .
Contents
The English alphabet : అక్షరమాల :
The set of letters used in writing a language is called the alphabet .
ఒక భాషను వ్రాయటానికి ఉపయోగించే అక్షరాలను ‘అక్షరమాల’ alphabet అంటారు .
There are 26 letters in English alphabet .
ఇంగ్లీషు అక్షరమాలలో 26 అక్షరాలున్నాయి .
Small letters and capital letters :
ఇంగ్లీషు అక్షరాలను capital letters ( పెద్ద అక్షరములు ) అని Small letters ( చిన్న అక్షరములు ) అని 2 విధాలుగా వ్రాస్తారు . ఈ 2 రకాలలోనూ అచ్చు అక్షరాలు , వ్రాత అక్షరాలు వేరు వేరుగా ఉంటాయి . వీటిని 4 types గా స్కూల్ లో తెలుగు విద్యార్ధులకు నేర్పుతారు.
ఇంగ్లీష్ లో పెద్ద అక్షరాలకు బదులు చిన్న అక్షరాలు , చిన్న అక్షరాలకు బదులు పెద్ద అక్షరాలను రాయటం కూడా దోషమే. అందువల్ల విద్యార్థులు పెద్ద అక్షరాలు ఎక్కడ ఉపయోగించాలో, చిన్న అక్షరాలు ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవాలి.
Use of capitals :
పెద్ద అక్షరాలు ఎప్పుడు ఉపయోగించాలి?
1 . ప్రతి వాక్యములోని మొదటి మాటను capital (పెద్ద అక్షరం) తో ప్రారంభించాలి.
- poetry(పద్యము) లో ప్రతి పంక్తి (line) మొదటి పదం capital తో ప్రారంభించాలి .
3 .మనుషులు పేర్లు , నదులు పేర్లు , పట్టణాలు పేర్లు , సముద్రాల పేర్లు , పర్వతాల పేర్లు , నెలల పేర్లు , వారాల పేర్లు , capital తో ప్రారంభించాలి .
4. I (నేను) ఎక్కడ వచ్చిన capital గానే రాయాలి .
- God (దేవుడు) , God ను సూచించే నామవాచకములు (almighty , lord etc ..,) సర్వనామము ( he , him , etc..,) ఎక్కడ వచ్చిన capital తో ప్రారంభించాలి.
- Direct speech లో కొటేషన్స్ వాక్యం మొదటి మాట capital తో ప్రారంభించాలి. ఇవికాక మిగిలిన సందర్బాలలో Small letters (చిన్న అక్షరాలు) ఉపయోగించాలి .
Vowels ( అచ్చులు) and Consonants (హల్లులు) :
english లో a , e , i , o , u అనే 5 అక్షరాలను vowels ( అచ్చులు) అంటారు.
మిగిలిన అక్షరాలను Consonants (హల్లులు) అంటారు.
Telugu లో అచ్చులు (vowels) లేకుండా కేవలం హల్లులతోనే (consonants) మాటలు ఎలా ఉండవో, english లో కూడా vowels లేకుండా కేవలం consonants తోనే మాటలు (words) ఉండవు.
W, y అనే అక్షరాలు కొన్ని vowels గా ఉంటాయి .
W – vowel గా ఉన్న మాటలు : cow , two , sword , window.
Y – vowel గా ఉన్న మాటలు : say , boy , type , away , sky etc.
Syllable (పదాంశము):
A word or a part of a word containing a vowel sound is called a syllable.
ఒక vowel తో కూడిన పదమును లేక పద భాగమును syllable (పదాంశం) అంటారు.
Examples (ఉదాహరణలు):
Cheese = ఒక syllable మాట.
But – ter = 2 syllables మాట.
Beau – ti – ful = 3 syllables మాట.
Note : పంక్తి (line) చివర పదమును విడగొట్టవలసినపుడు syllable దగ్గర విడగొట్టాలి.
Examples :
Beautiful అనే పదమును పంక్తి (line) చివర విడగొట్టాల్సినపుడు దానిని Beau – దగ్గరగాని, beau – ti – దగ్గరగాని విడగొట్టాలి.
Word (పదము):
A letter or a group of letters that has a meaning is called a word.
అర్థవంతమైన అక్షరమును లేదా అక్షర సముదాయమును word (పదము) అంటారు.
Examples :
I , we , you , pen , book , etc ..,